భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

శివాయిపల్లిలో భూముల రీసర్వే పరిశీలించిన RDO

రామాయంపేటమండలం శివాయిపల్లి గ్రామంలో భూముల సర్వే

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామాల్లో చాలాకాలంగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు రైతుల భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని RDO రామాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రామాయంపేటమండలం శివాయిపల్లి గ్రామంలో భూముల సర్వే

ఈ సందర్భంగా గ్రామంలో భూములకు సంబంధించి చాలాకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని RDO పేర్కొన్నారు. ఇలాంటి సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని, వాటికి పరిష్కారం చూపించేందుకు రీసర్వే చేపట్టిందని వివరించారు. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, సర్వే ప్రక్రియ ద్వారా రైతులకు ఉన్న సమస్యలను గుర్తించినట్లు తెలిపారు.

రామాయంపేటమండలం శివాయిపల్లి గ్రామంలో భూముల సర్వే

రీసర్వే ద్వారా భూముల హద్దులు, ఇతర భూ సంబంధిత అంశాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మళ్లీ భూ వివాదాలు తలెత్తకుండా చూడటంతో పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, RI గోపి, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.