భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామాల్లో చాలాకాలంగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు రైతుల భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని RDO రామాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలో భూములకు సంబంధించి చాలాకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని RDO పేర్కొన్నారు. ఇలాంటి సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం…