భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

హనుమాన్ నగర్ తండాలో కొత్త పెన్షన్ల పంపిణీ

హనుమాన్ నగర్ తండా.. లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేత.

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండాలో కొత్తగా మంజూరైన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పత్రాలను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు. ముఖ్యంగా కొత్త పెన్షన్ల మంజూరుతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు ఆర్థిక భరోసా లభించిందని తెలిపారు.

హనుమాన్ నగర్ తండా.. లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేత.

పెన్షన్లు అందుకోవడానికి అర్హత ఉన్నవారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ తండా వాసులు పాల్గొన్నారు.