భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండాలో కొత్తగా మంజూరైన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పత్రాలను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి…