భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మెదక్ జిల్లా గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక  జిల్లా అధ్యక్షుడిగా స్టేషన్ శీను, ప్రధాన కార్యదర్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన సంఘం సమావేశంలో జిల్లా స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘం ప్రతినిధులు పాల్గొని సంఘం అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిటీ మల్లయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎంపిక చేశారు.

ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా స్టేషన్ శీను, ప్రధాన కార్యదర్శిగా గోమారం కుంట లక్ష్మణ్ ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బండారి గంగాధర్, ఉపాధ్యక్షులుగా కాముని నాగేష్, గరిగే నర్సింగరావు, కొత్తల సిద్ధిరాములు బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యదర్శులుగా మంగినపల్లి బాలరాజ్, చింతకింది ఏసును ఎంపిక చేశారు.

మీడియా ప్రతినిధులుగా పంపరి స్వామి, శివ (నిజాంపేట), అధికార ప్రతినిధిగా పెంటం పరమేశ్వర్, చీఫ్ అడ్వైజర్‌గా కొత్తొల్ల సాయిలును నియమించారు. ఈ మేరకు జిల్లా గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

జిల్లా యూత్ గంగపుత్ర సంఘం కార్యవర్గం

జిల్లా యూత్ గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గాన్ని కూడా సమావేశంలో ఎన్నుకున్నారు. యూత్ సంఘం అధ్యక్షుడిగా కుంట నాగేష్, ఉపాధ్యక్షుడిగా కట్లె రమేష్, కోశాధికారిగా గరిగే రవితేజ, కార్యదర్శిగా ఏరువా అరవింద్ ఎంపికయ్యారు. యూత్ ఉపాధ్యక్షుడిగా ఏరువా శివశంకర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం రాజకుమార్, రాష్ట్ర నాయకులు కాపర్తి మోహన్ కృష్ణ, పాకం మధుసూదన్, మెదక్ జిల్లా మత్స్యశాఖ చైర్మన్ గడప దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన జిల్లా, యూత్ కార్యవర్గ సభ్యులకు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. గంగపుత్ర సంఘం ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, సంఘం అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.