భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

పాదయాత్రకు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సంఘీభావం

ఏడుపాయల నుండి ఎర్రవల్లి పాదయాత్రకు రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి సంపూర్ణ సంఘీభావం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఏడుపాయల శ్రీ వనదుర్గ భవానీ అమ్మవారి ప్రసాదాన్ని BRS అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అందించాలనే సంకల్పంతో ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రకు రెండో రోజు కూడా మద్దతు వెల్లువెత్తింది. చిన్న శంకరంపేటలోని ఏడుపాయల అమ్మవారి ఆలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు కొనసాగుతున్న ఈ పాదయాత్రకు BRS రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.

శంకరంపేట మండలంలోని గవ్వలపల్లి చౌరస్తా వద్ద పాదయాత్ర బృందాన్ని కలిసిన తిరుపతిరెడ్డి నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల సర్పంచ్ అందె కొండల్‌రెడ్డి, శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులను సన్మానించారు. అక్కడి నుంచి అందరూ కలిసి భారీ ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఏడుపాయల నుండి ఎర్రవల్లి పాదయాత్రకు రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి సంపూర్ణ సంఘీభావం

అమ్మవారి ప్రసాదం అందించాలనే సంకల్పం అభినందనీయం

ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారి ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందించాలనే పవిత్ర సంకల్పంతో BRS నాయకులు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కేసీఆర్‌కు మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో మళ్లీ BRS ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

ఏడుపాయల నుండి ఎర్రవల్లి పాదయాత్రకు రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి సంపూర్ణ సంఘీభావం

కాంగ్రెస్ హామీలపై విమర్శలు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో విఫలమైందని తిరుపతిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఏడుపాయల నుండి ఎర్రవల్లి పాదయాత్రకు రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి సంపూర్ణ సంఘీభావం

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. BRS నాయకులు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, రైతులు, మహిళలు, పేదల సంక్షేమం కోసం గతంలో అమలు చేసిన పథకాలను గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, రజక్‌పల్లి సర్పంచ్ కనకరాజు, BRSV నియోజకవర్గ నాయకులు గంజి నవీన్ శ్రీనివాస్, BRSV మండల అధ్యక్షుడు మావురం రాజు, వార్డు సభ్యుడు పంపరి నాగేష్ పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు వినయ్, ప్రవీణ్, సాయి, విల్సన్, సల్మాన్, అంతేలి నాగరాజు, కనుక రాజు, రమేష్, స్వామి, రాజు, శేఖర్, శ్రీకాంత్, నరేష్, లక్ష్మణ్, శంకరంపేట మండల సర్పంచులు, మాజీ సర్పంచులు, BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.