భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: మైనంపల్లి

634 కుటుంబాలకు పెన్షన్ భరోసా.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రోహిత్ రావు.

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు.

634 కుటుంబాలకు పెన్షన్ భరోసా.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రోహిత్ రావు.

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రాదేశ్యామ్ ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన 634 మంది లబ్ధిదారులకు చేయూత ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు.

పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

634 కుటుంబాలకు పెన్షన్ భరోసా.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రోహిత్ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో అర్హులైన పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన నిరుపేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని వివరించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహాలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు రైతుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు.

634 కుటుంబాలకు పెన్షన్ భరోసా.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రోహిత్ రావు.

గత పాలకులు పేదల సమస్యలను పట్టించుకోలేదు

గత పాలకులు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేస్తోందన్నారు.

634 కుటుంబాలకు పెన్షన్ భరోసా.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రోహిత్ రావు.

మెదక్ నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో పెన్షన్లు మంజూరు చేయించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు డాక్టర్ మోహన్ నాయక్, మెదక్ జిల్లా గిరిజన సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ నాయక్, MPDO దామోదర్, జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గౌడ్, యాదవరావు, లింగమూర్తి, గణేష్, నవీన్ కుమార్, జీవన్, బాబు, రవీందర్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఎంఎస్ఓ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.