భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

బీజేపీ మండల అధ్యక్షుడు రాజును పరామర్శించిన మల్లేష్ గౌడ్

తెలంగాణ ఉద్యమంలో తగిలిన గాయం.. మళ్లీ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడి, ప్రస్తుతం అనారోగ్య సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్న బీజేపీ శంకరంపేట మండల అధ్యక్షుడు పెద్ద పట్లోరి పోగుల రాజును పార్టీ నాయకులు పరామర్శించారు. బుధవారం శంకరంపేటలోని ఆయన స్వగృహానికి వెళ్లిన బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రాజును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో తగిలిన గాయం.. మళ్లీ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స

విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పోగుల రాజు అప్పట్లో పోలీసుల లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కుడి భుజానికి బలమైన గాయం కావడంతో అప్పటినుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న పాత గాయం ఇటీవల మళ్లీ తిరగబెట్టడంతో వైద్యుల సూచన మేరకు కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో తగిలిన గాయం.. మళ్లీ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స

ఈ విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా నాయకులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రాజుతో మాట్లాడి చికిత్స వివరాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ఉద్యమంలో తగిలిన గాయం.. మళ్లీ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స

ఈ పరామర్శ కార్యక్రమంలో రాష్ట్ర BJP కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు బైండ్ల సత్యనారాయణ, జిల్లా BJP ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ పబ్బ లక్ష్మణ్, మెదక్ మున్సిపల్ BJP అధ్యక్షుడు ప్రసాద్, దిశా కమిటీ సభ్యుడు MLN రెడ్డి, OBC మోర్చా రాష్ట్ర నాయకుడు గడ్డం కాశీనాథ్, రామాయంపేట మున్సిపల్ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, జిల్లా నాయకుడు బిక్షపతితో పాటు పలువురు BJP నాయకులు, కార్యకర్తలు పాల్గొని పోగుల రాజును పరామర్శించారు.