భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఇనుగుర్తి ఇన్‌చార్జి ఎంపీడీవోగా హరీష్ బాధ్యతల స్వీకరణ

ఇనుగుర్తి ఇన్చార్జి ఎంపీడీవో గా హరీష్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవోగా కేసముద్రంలో ఎంపీవోగా విధులు నిర్వహిస్తున్న తోట హరీష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనకు ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవో బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటివరకు ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బండారు పార్థసారధి, గతంలో పనిచేసిన పెద్దవంగర మండలానికి తిరిగి ఎంపీవోగా వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో కేసముద్రంలో ఎంపీవోగా పనిచేస్తున్న తోట హరీష్‌ను ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవోగా నియమించారు. ఈ క్రమంలో గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఇనుగుర్తి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత పక్షాలు సహకరించాలని కోరారు. అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.