భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రామవరంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

రామవరంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలను అక్కన్నపేట మండలంలోని రామవరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇందిరా గాంధీ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. దేశ అభివృద్ధితో పాటు పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె తీసుకున్న నిర్ణయాలు భారత చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు.

ముఖ్యంగా బ్యాంకుల జాతీయీకరణ, పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాలు ఇందిరా గాంధీ దూరదృష్టికి నిదర్శనమని బుర్ర ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆమె చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

ఇందిరా గాంధీ చూపిన ప్రజాసేవా మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, పేదల సంక్షేమం పార్టీ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామవరం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఇందిరా గాంధీకి నివాళులర్పించారు.