భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో BRSలో చేరిన యువకులు

రామాయంపేట లో కాంగ్రెస్ కు చెందిన యువకులు బి ఆర్ ఎస్ లో చేరిక
రామాయంపేట లో కాంగ్రెస్ కు చెందిన యువకులు బి ఆర్ ఎస్ లో చేరిక

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువకులు BRS పార్టీలో చేరారు. మాజీ కౌన్సిలర్ రాఫ్ శ్యామ్‌తో పాటు సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీ యువకులు శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో BRS తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో యువకులు గులాబీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.

రామాయంపేట లో కాంగ్రెస్ కు చెందిన యువకులు బి ఆర్ ఎస్ లో చేరిక
రామాయంపేట లో కాంగ్రెస్ కు చెందిన యువకులు బి ఆర్ ఎస్ లో చేరిక

ఈ సందర్భంగా హరీశ్‌రావు కొత్తగా పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రామాయంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో BRSలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులు పార్టీ నాయకుల సమక్షంలో BRSలో చేరారు.

రామాయంపేట లో కాంగ్రెస్ కు చెందిన యువకులు బి ఆర్ ఎస్ లో చేరిక

ఈ చేరిక కార్యక్రమంలో BRS నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, రామాయంపేట PACS చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సుప్రభాత్‌రావు, కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్, నాయకులు ఉమామహేశ్వర్, ఆసనోదిన్, అహ్మద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.