భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

కుటుంబాలకు భరోసా కల్పించే ఇందిరమ్మ బీమా పథకం

మూడు గ్రామాల్లో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కుటుంబంలో దురదృష్టవశాత్తు మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ నెల్లికుదురు మండలంలో ప్రారంభమైంది. మండలంలోని మేచరాజపల్లి, నెల్లికుదురు, ఆలేరు గ్రామాల్లో శుక్రవారం సంబంధిత అధికారులు అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరించి నమోదు చేసుకున్నారు.

మూడు గ్రామాల్లో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ

ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో గ్రామాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు గ్రామాల్లో అర్హులైన కుటుంబాలను గుర్తించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మూడు గ్రామాల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజలు ఉత్సాహంగా స్పందించి పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు.

మూడు గ్రామాల్లో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ

ఈ కార్యక్రమంలో మేచరాజపల్లి, నెల్లికుదురు, ఆలేరు గ్రామాల సర్పంచులు తూర్పాటి శంకరయ్య, పులి వెంకన్న, నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, ఉపసర్పంచులు తాళ్లపల్లి వెంకన్న గౌడ్, గన్న హరీష్, పంచాయతీ కార్యదర్శులు యాకూబ్ రెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

మూడు గ్రామాల్లో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ

మండలంలోని అన్ని గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను శనివారం నుంచి నెల్లికుదురు మండలంలోని అన్ని గ్రామాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి స్వీకరిస్తారని ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ప్రయోగాత్మకంగా శుక్రవారం మూడు గ్రామాల్లో దరఖాస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆయా గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దరఖాస్తులు చేసుకున్నారని వెల్లడించారు. నేటి నుంచి మండలవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.