భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని BJP నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన BJP మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రభారీ మాచర్ల కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు, కుట్రలను తిప్పికొట్టేందుకు కరీంనగర్లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఈ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతిపక్షాల ప్రచారానికి సమాధానంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ మహా పాదయాత్రకు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్కన్నపేట మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కరీంనగర్‌కు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, కిసాన్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి వీరాచారి, ST మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గులోత్ తిరుపతి నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కర్ణకంటి నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు సరూప, ST మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బానోతు అనిల్, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, మండల ఉపాధ్యక్షులు బోనగిరి తిరుపతి, అర్జున్ నాయక్, జగదీశ్వరాచారి, మండల కార్యదర్శి వేముల ప్రసాద్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కుంట స్వప్న రెడ్డి, SC మోర్చా అధ్యక్షుడు గిరిమల రాజు, ST మోర్చా అధ్యక్షుడు మాలోత్ రాజు, సోషల్ మీడియా కన్వీనర్ జంగపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఐలయ్య, కనకయ్య, గంపల మధు, పల్లె ప్రభాకర్, సంజీవరెడ్డి, బొంకురి రజినీకాంత్, రాజు నాయక్, జిల్లా కనకయ్య, ఆవుల కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.