భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఇందిరాపార్క్‌లో మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమం

మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన బండారి గంగాధర్...,*

భారత్ సమాచార్, హైదరాబాద్: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్రులందరికీ గంగపుత్ర రాజ్యాధికార పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల భవన్‌లో మత్స్యకారుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మురళీకృష్ణను కలిసి మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని గంగపుత్రుల అభివృద్ధి, సంక్షేమం, వారి సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. మత్స్యకారుల అభివృద్ధి, హక్కులు, సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గంగపుత్ర రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు మాదరబోయిన నరసయ్య, ఉపాధ్యక్షుడు రాచకట్ల శంకర్ అలియాస్ శ్రీధర్, సలహాదారు రానా బోయిన లక్ష్మణ్, కోశాధికారి పెద్ద బోయిన దయానంద్, జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్, బోర్డు డైరెక్టర్ మురళీకృష్ణ, గంగపుత్ర సభ్యులు, ఇతర పెద్దలు పాల్గొన్నారు.