భారత్ సమాచార్, హైదరాబాద్: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్రులందరికీ గంగపుత్ర రాజ్యాధికార పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల భవన్‌లో మత్స్యకారుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మురళీకృష్ణను కలిసి మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని గంగపుత్రుల అభివృద్ధి, సంక్షేమం, వారి సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించారు.…