భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యల్లోనూ నైపుణ్యం పెంపొందించుకోవాలని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, BJP జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ సూచించారు. ఆత్మరక్షణకు ఉపయోగపడే కరాటే వంటి విద్యలను నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు.
నర్సాపూర్ జూనియర్ కళాశాల మైదానంలో సన్‌షైన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తమ చేతుల మీదుగా బ్లాక్బెల్ట్లను ప్రదానం చేశారు. బ్లాక్బెల్ట్లు అందుకున్న విద్యార్థులను అభినందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. కరాటే కేవలం క్రీడ మాత్రమే కాదని, ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగపడే ముఖ్యమైన విద్య అని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో నిరంతరం కరాటే సాధన చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని సూచించారు. చదువుతో పాటు వివిధ రంగాల్లోనూ నైపుణ్యాలు సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుచేష్ యాదవ్, నిరంజన్, BJP జిల్లా కోశాధికారి అంజనేయులు గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు నాగేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీకాంత్, నాగరాజు, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు, జిల్లా కార్యదర్శి శివ, నాయకులు వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.