భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యల్లోనూ నైపుణ్యం పెంపొందించుకోవాలని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, BJP జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ సూచించారు. ఆత్మరక్షణకు ఉపయోగపడే కరాటే వంటి విద్యలను నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు.
నర్సాపూర్ జూనియర్ కళాశాల మైదానంలో సన్షైన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తమ…






