భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

హుస్నాబాద్‌లో TRS కొత్త కార్యాలయం ప్రారంభం

హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన శ్రావణ్ కుమార్ గౌడ్

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని TRS హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పురెల్ల శ్రావణ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శనివారం TRS పార్టీ నూతన కార్యాలయాన్ని శ్రావణ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారితో పాటు బావులు, చెట్లు, ఇతర నిర్మాణాలు కోల్పోయిన బాధితులకు కూడా నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు.

హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన శ్రావణ్ కుమార్ గౌడ్

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన పాంచజన్య పథకంలో భాగంగా ఉచిత విద్య, వైద్యం అందించే ప్రతిపాదనలు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని శ్రావణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన శ్రావణ్ కుమార్ గౌడ్

ఇకపై ప్రతి వారం రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, న్యాయపరమైన సమస్యలతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు అండగా ఉంటూ, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో TRS కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు లోకి రవిచంద్ర, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుక ప్రవీణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.