భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

కరీంనగర్ పాదయాత్రను విజయవంతం చేయాలి

హుస్నాబాద్:హా పాదయాత్రను విజయవంతం చేయాలి: శంకర్ ముదిరాజ్

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 23న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని BJP సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

మహా పాదయాత్ర నిర్వహణ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బి.ఎల్. రెడ్డి ఫంక్షన్ హాల్‌లో BJP హుస్నాబాద్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా పాదయాత్ర ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్తకు బాధ్యతలు అప్పగించి, ప్రజల మద్దతు కూడగట్టాలని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేస్తే పాదయాత్రను విజయవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మండల ప్రభారి తోట స్వరూప, మాజీ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెల్దండి రాజేంద్రప్రసాద్, మాజీ అధ్యక్షుడు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లి శ్రీనివాస్, జిల్లా ఓబీసీ మాజీ అధ్యక్షుడు బొమ్మగాని సతీష్, BJYM జిల్లా కార్యదర్శి కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శులు రత్నాకర్ రెడ్డి, బైరి అరుణ్, మహిళా జిల్లా కార్యవర్గ సభ్యురాలు చిన్మయి, ఓబీసీ మండల అధ్యక్షుడు పూదరి కిష్టయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మంద మహేశ్వర్ రెడ్డి, BJYM మండల అధ్యక్షుడు సొళ్ళు రజనీకాంత్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కండె శంకర్ పాల్గొన్నారు.

అలాగే మండల ఉపాధ్యక్షులు కుంట మల్లయ్య, భూతగడ్డపు బాలరాజు, బత్తుల శ్రీనివాస్, మండల కార్యదర్శి నార్లపురం సత్యం, సీనియర్ నాయకులు బొమ్మగాని జగన్నాథం, వెల్దండి సత్యనారాయణ, నెల్లి శ్రీనివాస్, జంగ వెంకట్ రెడ్డి, బూత్ అధ్యక్షులు బొల్లి సుధాకర్, భాష, బత్తిని మధు, గుజ్జుల బాలరాజు, పోలవేణి సందీప్, గీకురు సంతోష్, గుండాల ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, బొమ్మగాని ఈశ్వర్, పుట్ట కొమురయ్య, మెరుగు రవీందర్, కనకట్ల కిషన్, సొల్లు నాగార్జున, భక్తుల నాగార్జున, మీదిని కొమరయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.