భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 23న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని BJP సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
మహా పాదయాత్ర నిర్వహణ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బి.ఎల్. రెడ్డి ఫంక్షన్ హాల్లో BJP హుస్నాబాద్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్…






