భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

రెండు పోటీల్లో సత్తా చాటిన నెల్లికుదురు విద్యార్థులు

జిల్లా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు ఎల్టా,చెకుముకి పోటీల్లోనెల్లికుదురు విద్యార్థుల ప్ర

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహించిన ఎల్టా ఇంగ్లీష్ ప్రతిభా పోటీలు, చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు పోటీల్లో విజయాలు సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఎల్టా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి ఇంగ్లీష్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. ఇంగ్లీష్ ఒలంపియాడ్ సీనియర్ విభాగంలో ఎస్. దీక్షిత్, జూనియర్ విభాగంలో పి. అయాన్, పి. సిరివెన్నెల విజేతలుగా నిలిచారు. వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ స్థానం

జిల్లా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు ఎల్టా,చెకుముకి పోటీల్లోనెల్లికుదురు విద్యార్థుల ప్ర

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం నెల్లికుదురు ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లోనూ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. జి. ప్రణీత, జి. అమృతవర్షిణి, పి. అయాన్‌లతో కూడిన బృందం ప్రథమ స్థానాన్ని సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది.

విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్

విద్యార్థులు సాధించిన విజయాలపై పాఠశాల ప్రిన్సిపల్ జి. ఉపేందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, శాస్త్రీయ దృక్పథం, తార్కిక ఆలోచనా సామర్థ్యాలను కూడా విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రతిభా పోటీల్లో పాఠశాల విద్యార్థులు విజయాలు సాధించి జిల్లా స్థాయికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

జిల్లా స్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.