భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

పేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ జీవిత బీమా

నిరుపేదలకు అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం
నిరుపేదలకు అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా అన్నారు. అర్హులైన కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

నిరుపేదలకు అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం

ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు ఎస్సీ కాలనీ, నాలుగో వార్డు రైతు వేదిక, రెండో వార్డు కోమటిపల్లి ప్రాంతాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలకు పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

నిరుపేదలకు అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం

రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ యజమానికి జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు కార్యక్రమంలో వివరించారు. పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పథకం కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన కుటుంబాలు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి పథకంలో భాగస్వాములు కావాలని సూచించారు.

నిరుపేదలకు అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్, మున్సిపల్ కమిషనర్ ఏ. రవీందర్, నాలుగో వార్డు కౌన్సిలర్ బైరం స్వప్న కుమార్, రెండో వార్డు కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్, మూడో వార్డు కౌన్సిలర్ రవి నాయక్, కాంగ్రెస్ నాయకులు డాకి స్వామి, చింతల యాదగిరి, రాము తదితరులు పాల్గొన్నారు.