భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మెదక్ క్రీడాకారుల పయనం

అండర్ పోటీలు బాలబాలికల కబడ్డీ పోటీలో పాల్గొనేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ఆదివారం ఉదయం మెదక్ నుండ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా జట్లు ఆదివారం ఉదయం మెదక్ పట్టణం నుంచి బయలుదేరాయి.

ఈ సందర్భంగా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మెదక్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు మాట్లాడుతూ, తొర్రూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల జట్లు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అండర్ పోటీలు బాలబాలికల కబడ్డీ పోటీలో పాల్గొనేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ఆదివారం ఉదయం మెదక్ నుండ

జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అవసరమైన కబడ్డీ కిట్లను పంపిణీ చేసినట్లు నాగరాజు వెల్లడించారు. క్రీడాకారులు ఆదివారం ఉదయం 8 గంటలకు మెదక్ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి తొర్రూరు పోటీలకు బయలుదేరినట్లు తెలిపారు.

జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు SGF మెదక్ జిల్లా చైర్మన్, గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం, అవసరమైన సదుపాయాలు అందించడం వల్ల వారు మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.