భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

రాయిలాపూర్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

నిరుపేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎంతో ఉపయోగపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో సర్పంచ్ గట్టు సుశీల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ యజమానికి జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజీ లోద్దిన్, గట్టు ప్రశాంత్, పంచాయతీ సెక్రటరీ మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మహేష్, జిన్న మంజుల, శ్రీనివాస్, కుంటి శ్రీను, జిన్న నాగమణి, సహదేవ్, చాకలి నరసింహులు, తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.