భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎంతో ఉపయోగపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో సర్పంచ్ గట్టు సుశీల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ…






