భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

కనుల పండువగా అక్షిత–సామంత్ వివాహం.. వధూవరులకు గ్రామస్తుల ఆశీస్సులు

వైభవోపేతం అక్షిత సామంత్ పరిణయం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన బొంపల్లి వెంకటేశ్వరరావు–లక్ష్మీ దంపతుల కుమార్తె అక్షిత, సామంత్‌ల వివాహ వేడుక హైదరాబాద్‌లోని MSR కన్వెన్షన్‌లో ఆదివారం వైభవంగా, కనుల పండువగా జరిగింది. వివాహ వేడుకకు పుట్టిన గ్రామమైన చిన్ననాగారం నుంచి గ్రామస్తులు, బాల్యమిత్రులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

వైభవోపేతం అక్షిత సామంత్ పరిణయం..

వెంకటేశ్వరరావు కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, తమ పుట్టిన ఊరిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. గ్రామస్తులతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుమార్తె వివాహానికి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. గ్రామస్తులు, బాల్యమిత్రులతో పాటు వివిధ పార్టీల నాయకులకు స్వయంగా ఆహ్వానాలు అందించడంతో పలువురు వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, తమ ఊరికి చెందిన వెంకటేశ్వరరావు–లక్ష్మీ దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ గ్రామస్తులను మరిచిపోకుండా కుమార్తె వివాహానికి శుభలేఖలు అందించి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఆహ్వానం తమకు ఎంతో ఆత్మీయతను కలిగించిందని, ఊరితో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసిందని పేర్కొన్నారు.

వైభవోపేతం అక్షిత సామంత్ పరిణయం..

గ్రామస్తులంతా సామూహికంగా వివాహ వేడుకకు వెళ్లి అక్షిత–సామంత్‌లను ఆశీర్వదించారు. వధూవరులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో స్థానిక సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, బైరు చిన్న బాలయ్య గౌడ్, బైరు అశోక్ గౌడ్, ఏలేటి మంగారెడ్డి, బండారి శ్రీనివాస్ రెడ్డి, బైరు వెంకన్న, బైరు పటేల్ కొమురయ్య గౌడ్, మునిగంటి కుమార్, గుండాల ధర్మయ్య, నిడిగంటి చంద్రమౌళి, బైరు శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, మద్దెల సుధాకర్ గౌడ్, చెడుపాక యాకూబ్, మిత్తింటి బాలకృష్ణ, కుంభం మహేందర్ రెడ్డి, పెదగోని రాజు గౌడ్, వడపల్లి సందీప్ గౌడ్, మద్దెల కరుణాకర్ గౌడ్, బైరు వినయ్ గౌడ్, మెడికల్ స్టోర్ రమేష్, ఉడుత కొమరుమల్లు, బొబ్బల ముత్తయ్య, మునిగంటి రామాచారి, భూక్య బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అక్షిత–సామంత్‌ల వివాహ వేడుకకు మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత వద్దిరాజు కిషన్, ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ తదితరులు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందించారు. BRS, కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సైతం వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.