భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఇందిరమ్మ బీమా కుటుంబ సభ్యులందరికీ వర్తింప చేయాలి

ఇందిరమ్మ బీమా.. కుటుంబ సభ్యులందరికీ వర్తింప చేయాలి..                         సామాజిక కార్యకర్త శ్రీన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కుటుంబంలో 18 ఏళ్లు నిండిన, 59 ఏళ్లలోపు ఉన్న సభ్యులందరికీ వర్తింప చేయాలని చిన్ననాగారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బైరు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒకే వ్యక్తికి బీమా వర్తించే విధంగా ఉన్న నిబంధనలను సవరించి, అర్హులైన కుటుంబ సభ్యులందరికీ బీమా భరోసా కల్పించాలని కోరారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం అభినందనీయమని తెలిపారు. అయితే, కుటుంబంలో ఒక్క వ్యక్తికి మాత్రమే బీమా వర్తింపజేయడం వల్ల మిగతా సభ్యులకు ఈ పథకం ద్వారా రక్షణ లభించదని పేర్కొన్నారు.

కుటుంబంలో బీమా వర్తించే వ్యక్తి కాకుండా ఇతర సభ్యులు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి ఈ పథకం కింద బీమా ప్రయోజనం అందకపోవచ్చని అన్నారు. అందువల్ల కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన 59 ఏళ్లలోపు ఉన్న సభ్యుల సంఖ్య ఎంత ఉన్నా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వర్తించేలా ప్రభుత్వం విధివిధానాల్లో మార్పులు తీసుకురావాలని బైరు శ్రీనివాస్ గౌడ్ కోరారు.