భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కుటుంబంలో 18 ఏళ్లు నిండిన, 59 ఏళ్లలోపు ఉన్న సభ్యులందరికీ వర్తింప చేయాలని చిన్ననాగారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బైరు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒకే వ్యక్తికి బీమా వర్తించే విధంగా ఉన్న నిబంధనలను సవరించి, అర్హులైన కుటుంబ సభ్యులందరికీ బీమా భరోసా కల్పించాలని కోరారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కుటుంబాలకు…






