భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

₹2.30 కోట్లతో మహమ్మదాపూర్ గుట్టల పర్యాటక అభివృద్ధి

అనభేరి స్మారక పార్కుకు రూ.2.30 కోట్లు..  మంత్రి పొన్నంకు ప్రజా సంఘాల ఐక్య వేదిక కృతజ్ఞతలు..

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరవీరుడు అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్కు, పర్యాటక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹2.30 కోట్ల నిధులు మంజూరు చేయడంపై ప్రజా సంఘాల ఐక్య వేదిక హర్షం వ్యక్తం చేసింది. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మహమ్మదాపూర్ గుట్టల్లోని అనభేరి ప్రభాకర్ రావు స్మారక మందిరం వద్ద కృతజ్ఞతా సభ నిర్వహించారు.

అనభేరి స్మారక పార్కుకు రూ.2.30 కోట్లు..  మంత్రి పొన్నంకు ప్రజా సంఘాల ఐక్య వేదిక కృతజ్ఞతలు..

ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్వాహకులు మార్క అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అనభేరి ప్రభాకర్ రావు సాగించిన వీరోచిత పోరాటం, ప్రజల కోసం చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని నాయకులు పేర్కొన్నారు. అలాంటి అమరవీరుడి స్మారక మందిరం, పార్కు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమని తెలిపారు.

అనభేరి స్మారక పార్కుకు రూ.2.30 కోట్లు..  మంత్రి పొన్నంకు ప్రజా సంఘాల ఐక్య వేదిక కృతజ్ఞతలు..

అమరవీరుల చరిత్ర, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు స్మారక పార్కు అభివృద్ధి ఎంతో కీలకమని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో స్మారక పార్కు, పర్యాటక అభివృద్ధి పనులు పూర్తయితే మహమ్మదాపూర్ గుట్టలకు మరింత గుర్తింపు లభిస్తుందని, ఈ ప్రాంతం చారిత్రక ప్రాధాన్యతతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనభేరి ప్రభాకర్ రావు పోరాట చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేలా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆకాంక్షించారు.

అనభేరి స్మారక పార్కుకు రూ.2.30 కోట్లు..  మంత్రి పొన్నంకు ప్రజా సంఘాల ఐక్య వేదిక కృతజ్ఞతలు..

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జిల్లెల తిరుమల తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య, చిగురుమామిడి మండల అధ్యక్షుడు అందె సురేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్ గౌడ్, సైదాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కిష్టయ్య, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బానోతు భాస్కర్ నాయక్, చింతల బాలరాజు, అక్కన్నపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్, మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, ఉపసర్పంచ్ కత్తుల సమ్మరాజు యాదవ్, దుద్దేడ శ్రీనాథ్ గౌడ్, పోతుగంటి బాలయ్య, గట్టు రాములు గౌడ్, కల్లపల్లి వెంకటస్వామి, పూదరి శ్రీనివాస్, రమేష్ నాయక్, చెప్పాల శ్రీధర్, కొంకట సదానందం, బెజ్జంకి బాబు, సుగుర్తి బాలరాజ్, మౌటం సంపత్, మెరుగు వెంకటయ్య, దుద్దేడ తిరుపతి గౌడ్, ఆకుల వెంకటస్వామి, కోయడ శ్రీనివాస్, కాసర్ల ఐలయ్య, కుంచం రాజయ్య, కవ్వ రాజిరెడ్డి, సంపత్, గోపాల్, పొన్నం రవి, జిల్లెల మాధవరెడ్డి, శ్రీరామ చందు, కొంకట రాజు, రమేష్‌తో పాటు అనభేరి ప్రభాకర్ రావు అభిమానులు పాల్గొన్నారు.