భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఇనుగుర్తి ప్రజావాణికి వచ్చింది ఒకే ఒక్క దరఖాస్తు

ఇనుగుర్తి"ప్రజావాణి"కి డిఎల్పిఓ హాజరు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఇనుగుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డీఎల్‌పీఓ గంగాభవాని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుంకర శ్రీనివాసులు, ఎంపీడీవో తోట హరీష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు అందింది. అధికారులు ఆ దరఖాస్తును స్వీకరించి, సంబంధిత సమస్యపై దృష్టి సారించారు.

ప్రజావాణి చక్కని వేదిక: డీఎల్‌పీఓ

ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఒకే చోట హాజరవుతున్నందున ప్రజల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని డీఎల్‌పీఓ గంగాభవాని తెలిపారు. మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో అధికారులకు తెలియజేయాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.