భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

చిన్నారులకు ఇక అంగన్‌వాడీల్లో పోషకాహార అల్పాహారం

'కాస్య'తండ'వావిలాల'ల్లో"తొలిముద్ద"ప్రారంభం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తొలిముద్ద’ కార్యక్రమం ఇనుగుర్తి మండలంలోని కాస్య తండా, వావిలాల గ్రామాల్లో సోమవారం ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సర్పంచులు చిన్నారులకు ఉదయపు అల్పాహారం అందించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కాస్య తండాలో సర్పంచ్ బోడ నర్సింహ, వావిలాలలో సర్పంచ్ గోగుల మమత ప్రశాంత్ తమ గ్రామాల్లోని సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించవచ్చని తెలిపారు.

'కాస్య'తండ'వావిలాల'ల్లో"తొలిముద్ద"ప్రారంభం..

పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యం

ఈ సందర్భంగా సర్పంచులు నర్సింహ నాయక్, గోగుల మమత ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ప్రీ-స్కూల్ చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించేందుకు తొలిముద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెప్పారు. చిన్నారులకు చిన్న వయసు నుంచే సరైన పోషకాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు.

'కాస్య'తండ'వావిలాల'ల్లో"తొలిముద్ద"ప్రారంభం..

చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో ఉపసర్పంచ్ నవీన్, అంగన్‌వాడీ టీచర్లు, చిన్నారులు, వారి తల్లులు పాల్గొన్నారు.