భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తొలిముద్ద’ కార్యక్రమం ఇనుగుర్తి మండలంలోని కాస్య తండా, వావిలాల గ్రామాల్లో సోమవారం ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సర్పంచులు చిన్నారులకు ఉదయపు అల్పాహారం అందించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కాస్య తండాలో సర్పంచ్ బోడ నర్సింహ, వావిలాలలో సర్పంచ్ గోగుల మమత ప్రశాంత్ తమ గ్రామాల్లోని సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు…