భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

హుస్నాబాద్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

హుస్నాబాద్‌లో వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల దాడులు  ముగ్గురిపై కేసు నమోదు   ప్రత్యేక తనిఖీలు నిర్వహ

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ తనిఖీల్లో వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం ఉన్న ముగ్గురిపై అనైతిక రవాణా నిరోధక చట్టం–1956 (ఐటీపీఏ) కింద కేసు నమోదు చేశారు.

హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆదేశాల మేరకు సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ పి. లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన నిర్వాహకురాలు కంసాని అనిత, కంసాని రాముతో పాటు ఒక విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా

వ్యభిచార గృహాలు నిర్వహించడం, ఇలాంటి కార్యకలాపాలకు సహకరించడం, వ్యక్తులను ప్రలోభపెట్టి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోకి తీసుకురావడం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

హుస్నాబాద్ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే ఆలస్యం చేయకుండా పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చే ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.