భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ తనిఖీల్లో వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం ఉన్న ముగ్గురిపై అనైతిక రవాణా నిరోధక చట్టం–1956 (ఐటీపీఏ) కింద కేసు నమోదు చేశారు.

హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆదేశాల మేరకు సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ పి. లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన…