భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

భక్త శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలుప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రత కథా పారాయణం

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రామవరం రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ శివభక్త మార్కండేయ స్వామి, శ్రీ సీతారామ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడంతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

వ్రతంలో పాల్గొన్న భక్తులు సంప్రదాయబద్ధంగా పూజా సామగ్రిని సమకూర్చుకుని సంకల్పం చేశారు. అనంతరం గణపతి పూజ, కలశ స్థాపన, నవగ్రహ పూజలను నిర్వహించి శ్రీ సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆ తర్వాత స్వామివారి వ్రత కథను పారాయణం చేసి, హారతి సమర్పించారు. కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని భక్తులు స్వామివారిని ప్రార్థించారు.

భక్త శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలుప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రత కథా పారాయణం

ఆలయ పూజారి రామక లక్ష్మణ్ అయ్యగారు వేదమంత్రోచ్ఛారణల మధ్య వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిభావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

పూజలు ముగిసిన అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సామూహికంగా వ్రతాలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి అరుణ, పంతం కన్యాకుమారి, వడ్డేపల్లి లక్ష్మయ్య, కౌన్సిలర్ కొండ రజిత సత్యనారాయణ, బూర్ల సత్యనారాయణ, చింతకింది శ్రీనివాస్, కనకయ్య, దూడం నాగభూషణం, రాజ్‌కుమార్, చిలక రాజు, కోమటి నారాయణ, అశోక్, శ్రీనివాస్, రామకృష్ణ, ఆత్మలింగం తదితరులు పాల్గొన్నారు.