భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చింతల విజయ్ కుమార్‌ను నియమించారు.
జిల్లా ఉపాధ్యక్షులుగా జాజల చందు, మందాల బాబు, కుంభాల రమేష్‌లకు బాధ్యతలు అప్పగించారు. అధికార ప్రతినిధిగా ధార స్వామి, కార్యదర్శులుగా నలుమాల నవీన్, నిమ్మ నితిన్, తుక్కోజి సతీష్‌లను ఎంపిక చేశారు. ప్రచార కార్యదర్శిగా తాండ్ర నరసింహులు, కార్యనిర్వాహక కార్యదర్శిగా తలారి నరసయ్య, యువజన విభాగం కార్యదర్శిగా గుమ్మడి సాయి శ్రీరామ్ నియమితులయ్యారు. మీడియా సెల్ ఇన్‌ఛార్జులుగా పుట్టరాజు, జాల శ్రీనివాస్‌లకు బాధ్యతలు అప్పగించారు. గౌరవ అధ్యక్షులుగా మండల యాదగిరి, గుడుమల్ల సత్తయ్యలను ఎంపిక చేశారు.
నూతన కమిటీకి జిల్లా స్థాయిలో సంస్థ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ నియామకాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. జిల్లాలో సంస్థను బలోపేతం చేస్తూ, మాల జాతికి ఎక్కడైనా అన్యాయం జరిగినా ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ సూచించారు. మాలల హక్కుల సాధన కోసం కృషి చేయాలని, ఈ విషయంలో సిద్దిపేట జిల్లా ముందుండాలని నూతన కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేడి అంజయ్య, వెన్న రాజు, బుట్టి సత్యనారాయణ, రాష్ట్ర పొలిట్‌బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు, రాష్ట్ర సాంస్కృతిక సారథి కన్వీనర్ ఎలుక దేవయ్య, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాల్వ నరేష్, కంబాల రవి, దుండ్ర సుమన్, సుంకే రమేష్, డ్యాగాల సతీష్, దార మల్లయ్య, బందెల గోపాల్, సాయిపరమేశ్వర్ తదితర కుల బాంధవులు పాల్గొన్నారు.