భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్.. ఘనంగా సత్కారం

ఆరె కిషోర్ మాలలు హక్కుల సాధనకు కృషి చేయాలి.... వెన్న రాజు

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్ నియామకం కావడం అభినందనీయమని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు అన్నారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆరె కిశోర్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, నియోజకవర్గ, మండల బాధ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన ఆరె కిశోర్ జాతీయ మాల మహానాడులో ఎన్నో పోరాటాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. సంఘం కోసం ఆయన చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర, జాతీయ నాయకత్వం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరె కిశోర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లావ్యాప్తంగా జాతీయ మాల మహానాడును మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వెన్న రాజు సూచించారు. మాల సామాజిక వర్గానికి ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా స్పందించి హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సంఘం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సామాజిక న్యాయం కోసం పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సుంకే రమేష్, దుండ్ర సుమన్, డ్యాగాల సతీష్, దుండ్ర ఎల్లయ్య, జాల శ్రీనివాస్, డ్యాగాల మహేందర్, మీదిని ఆంజనేయులు, సుంకే సంపత్, సుంకే కుమార్, హుస్నాబాద్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు, గాంధీనగర్ గ్రామ సర్పంచ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు పోలు సంపత్ తదితరులు పాల్గొన్నారు.