భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని సైదాపూర్ మండలం సోమరం గ్రామ సర్పంచ్ కందుల అనిత అంజిబాబు అన్నారు. మండలంలోని సోమరం చౌరస్తాలో ఆమె ఆధ్వర్యంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాకాల మొగిలికి ₹.35 వేలు, తిప్పిరిశెట్టి ఐలయ్యకు ₹.20 వేలు, కెక్కెర్ల ప్రభాకర్‌కు ₹.24 వేల విలువైన చెక్కులను అందజేశారు. ముగ్గురు లబ్ధిదారులకు కలిపి మొత్తం ₹.79 వేల ఆర్థిక సాయం అందించారు.
అనంతరం సర్పంచ్ కందుల అనిత మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అర్హులైన పేదలకు ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. అవసరంలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వెన్నంపల్లి సమీరయ్య, వెన్నంపల్లి సహకార సంఘం అధ్యక్షుడు పంతంగి రవీందర్ గౌడ్, సముద్రాల తిరుపతి గౌడ్, అనగోని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కందుల సంపత్, గడ్డం శ్రీనివాస్, వార్డు సభ్యుడు పడాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.