భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని సైదాపూర్ మండలం సోమరం గ్రామ సర్పంచ్ కందుల అనిత అంజిబాబు అన్నారు. మండలంలోని సోమరం చౌరస్తాలో ఆమె ఆధ్వర్యంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాకాల మొగిలికి ₹.35 వేలు, తిప్పిరిశెట్టి ఐలయ్యకు ₹.20 వేలు, కెక్కెర్ల ప్రభాకర్‌కు ₹.24 వేల విలువైన చెక్కులను అందజేశారు. ముగ్గురు లబ్ధిదారులకు కలిపి మొత్తం ₹.79 వేల ఆర్థిక…