భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శాంతినగర్ ఎఫ్.సి.ఐ గోడౌన్ వద్దగల విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వానరాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో వానరం మృతి చెందింది. స్థానిక వస్త్రం తండాకు చెందిన ఆర్ఎస్ఎస్, బిజెపి గిరిజన మోర్చా జిల్లా నాయకులు ధరావత్ రవి నాయక్ వానరం మృతి చెందడంతో చల్లించి పోయారు. హిందూ ధర్మం ప్రకారం, గోతి తవ్వి వానరానికి అంత్యక్రియలు చేశారు. ధరావత్ రవి నాయక్ చేసిన దాతృత్వానికి పలువురు ఆయనను అభినందించారు. ధరావత్ రవి నాయక్ మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రామాయణం ఇతివృత్తాల్లో వానరానికి ప్రత్యేక చోటు ఉందని వానరాలు ఉన్నచోట వాహనాలు చూసుకొని వెళ్లాలని వాహనదారులకు, ప్రయాణికులకు సూచించారు.