భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శాంతినగర్ ఎఫ్.సి.ఐ గోడౌన్ వద్దగల విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వానరాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో వానరం మృతి చెందింది. స్థానిక వస్త్రం తండాకు చెందిన ఆర్ఎస్ఎస్, బిజెపి గిరిజన మోర్చా జిల్లా నాయకులు ధరావత్ రవి నాయక్ వానరం మృతి చెందడంతో చల్లించి పోయారు. హిందూ ధర్మం ప్రకారం, గోతి తవ్వి వానరానికి అంత్యక్రియలు చేశారు. ధరావత్ రవి నాయక్ చేసిన దాతృత్వానికి పలువురు ఆయనను అభినందించారు. …