భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శివాలయం, కాల్వ గట్టు హనుమాన్ మందిరం, లింగమయ్య సమీపంలోని హనుమాన్ మందిరాల్లో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. పండుగ సందర్భంగా ఆలయాలను శుభ్రం చేసి, అందంగా అలంకరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు కండెల రాజు, మన్నె నిరంజన్ దాస్, సరళ ఆంజనేయులు గౌడ్, ఎండోమెంట్ కో-కన్వీనర్ రాజి రెడ్డి, శేఖర్ యాదవ్, రామ్ నితీష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా వారు నర్సాపూర్ పట్టణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని కోరుకున్నారు.