భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

కార్తీక దీపోత్సవానికి పోటెత్తిన భక్తులు

భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్తీకమాస దీపోత్సవ వేడుకలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ఆది లక్ష్మీనారాయణ స్వామి శివాలయం, రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస దీపోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వీరప్ప గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేళ ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తుల సందడి నెలకొంది.

భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్తీకమాస దీపోత్సవ వేడుకలు

వేడుకల్లో భాగంగా స్వామివారి పల్లకిసేవ, జ్వాలాతోరణం కార్యక్రమాలను భక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం భక్తులు నియమనిష్ఠలతో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాల క్షేమం, సుఖసంతోషాల కోసం మొక్కులు చెల్లించుకున్నారు. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఎంతో అందంగా కనిపించింది.

భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్తీకమాస దీపోత్సవ వేడుకలు

ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు దీపాలను వెలిగించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు భక్తిపారవశ్యంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్తీకమాస దీపోత్సవ వేడుకలు

ఈ వేడుకల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస దీపోత్సవం సందర్భంగా ఆలయంలో భక్తుల రాకతో పండుగ వాతావరణం నెలకొంది.