భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ఆది లక్ష్మీనారాయణ స్వామి శివాలయం, రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస దీపోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వీరప్ప గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేళ ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తుల సందడి నెలకొంది.
వేడుకల్లో భాగంగా స్వామివారి పల్లకిసేవ, జ్వాలాతోరణం కార్యక్రమాలను భక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం భక్తులు నియమనిష్ఠలతో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు…






