భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఈసీఐఎల్‌ విజేతలకు తెలంగాణ భవన్‌లో ఘన సన్మానం

ఈసీఐఎల్ యూనియన్ ఎన్నికల్లో

భారత్ సమాచార్, హైదరాబాద్: ఈసీఐఎల్‌ యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో బీఆర్టీయూ, సీఐటీయూ, ఓబీసీ సంఘాల కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో 51 శాతానికి పైగా ఓట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంతో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్‌ ఆధ్వర్యంలో విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ MP బోయినపల్లి వినోద్‌కుమార్‌ హాజరై విజయం సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను అభినందించారు. ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు BRS ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత విషయంలో పార్టీ వారికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కార్మికులకు సంబంధించిన వేతన ఒప్పందాల అమలు, సంస్థల్లో ఖాళీల భర్తీ, కొత్త నియామకాల అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ECIL, మిధాని, BDL కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.