భారత్ సమాచార్, హైదరాబాద్: ఈసీఐఎల్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో బీఆర్టీయూ, సీఐటీయూ, ఓబీసీ సంఘాల కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో 51 శాతానికి పైగా ఓట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంతో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్ ఆధ్వర్యంలో విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ MP బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరై విజయం సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను…






