భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

నెల్లికుదురు, ఇనుగుర్తిలో ఘనంగా కార్తీక దీపోత్సవం

దేదీప్యమానం.!కార్తీక దీపోత్సవాలు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, ఇనుగుర్తి మండల కేంద్రాలతో పాటు ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో కార్తీక దీపోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఎటుచూసినా దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

నెల్లికుదురులో..

దేదీప్యమానం.!కార్తీక దీపోత్సవాలు..

మండల కేంద్రం నెల్లికుదురులోని శివపార్వతీ సమేత భక్త మార్కండేయ ఆలయం వద్ద కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. పరమశివుడి సన్నిధిలో దీపారాధన చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఇనుగుర్తిలో..

దేదీప్యమానం.!కార్తీక దీపోత్సవాలు..

మండల కేంద్రం ఇనుగుర్తిలోని చారిత్రక శివాలయం వద్ద కూడా కార్తీక దీపోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇనుగుర్తి పట్టణవాసులతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించి పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశారు.

భక్తులంతా కలిసి 'ఓం నమశ్శివాయ' అంటూ శివనామస్మరణ, పారాయణం చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక నినాదాలతో మారుమోగాయి. భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో చారిత్రక శివాలయం పరిసర ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. కార్తీక పౌర్ణమి వేడుకల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొని భక్తిభావాన్ని చాటుకున్నారు.