భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, ఇనుగుర్తి మండల కేంద్రాలతో పాటు ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో కార్తీక దీపోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఎటుచూసినా దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

నెల్లికుదురులో..

మండల కేంద్రం నెల్లికుదురులోని శివపార్వతీ సమేత భక్త మార్కండేయ ఆలయం వద్ద కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక…