భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వాలు అండగా నిలవాలి: ఈటల

పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వాల అండ అవసరం: ఈటల రాజేందర్

భారత్ సమాచార్, మేడ్చల్ జిల్లా: వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం పౌల్ట్రీ అని, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు అండగా నిలవాలని మల్కాజిగిరి BJP ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హైదరాబాద్‌లోని నొవొటెల్‌లో IPEMA ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్.పీ. సింగ్ బఘేల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగం ప్రాధాన్యతను ప్రస్తావించిన ఈటల రాజేందర్.. కోట్లాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ రంగానికి ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహం అవసరమని తెలిపారు. పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మొక్కజొన్న ధరలను నియంత్రించడంతో పాటు, సోయా, మొక్కజొన్న దిగుమతులపై సుంకాల మినహాయింపు కల్పించే అంశంలో కృషి చేస్తామని చెప్పారు.

పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వాల అండ అవసరం: ఈటల రాజేందర్

పౌల్ట్రీ రంగానికి అవసరమైన మద్దతు, ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని ఈటల పేర్కొన్నారు. అలాగే వైరస్‌ల కారణంగా పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను నివారించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

పౌల్ట్రీ రైతుల సమస్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.