భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

కార్తీక పౌర్ణమి సందర్భంగా వ్రతాలు, అన్నదాన కార్యక్రమం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 59 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతం.

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 59 మంది జంటలు ఈ సామూహిక వ్రతంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు. ఆలయ అర్చకులు ఆరుట్ల శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కథలు, ఉపమానాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వ్రత కార్యక్రమం సాగింది.

వ్రత కార్యక్రమం అనంతరం 239 మంది భక్తులకు భోజన ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పూర్వపు గవర్నర్, ఆలయ వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ గీతా రాజేందర్ రెడ్డి, మరో పూర్వపు గవర్నర్ లయన్ తమ్మేర శారద లక్ష్మీనర్సింహారావు, పూర్వపు అధ్యక్షులు లయన్ డాక్టర్ కొత్త లక్ష్మి యాదగిరి రెడ్డి, డాక్టర్ అనురాధ కిరణ్ కుమార్, తమ్మేర విశ్వేశ్వర్ రావు, క్లబ్ అధ్యక్షులు నాళ్ల అనసూయ కృష్ణమూర్తి, సెక్రటరీ పోతుల వెంకటేశ్వర్ రెడ్డి, కోశాధికారి లయన్ ముదిరెడ్డి జ్యోతి రమణారెడ్డి, లయన్ తమ్మి శోభ ఉపేందర్ రావు, లయన్ కోనే రేణుక ప్రభాకర్, లయన్ మల్యాల విజయలక్ష్మి వెంకటేశ్వర్ రావుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అదే విధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని పేర్కొన్నారు.